పీస్ సెంటర్ లాస్ ఏంజిల్స్ చైర్మన్గా విజయ్ పాటిల్ ఎన్నిక.. నూతన కార్యవర్గం ప్రకటన!
వివిధ కమ్యూనిటీల మధ్య శాంతి , పరస్పర అవగాహనను పెంపొందించడానికి కృషి చేసే లాభాపేక్ష లేని సంస్థ ‘పీస్ సెంటర్ లాస్ ఏంజిల్స్’ (Peace Center Los Angeles) బోర్డు చైర్మన్గా విజయ్ పాటిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లాస్ ఏంజిల్స్ వేదికగా ఈ నియామకం జరిగింది.
నూతన కార్యవర్గ వివరాలు:
చైర్మన్: విజయ్ పాటిల్
వైస్ చైర్మన్: డాక్టర్ సుక్రిత్
కార్యదర్శి: చారు శివ్కుమార్
కోశాధికారి: అరవింద్ పటేల్
సంస్థ నిర్వహించే ప్రధాన కార్యక్రమాలు…
అంతర్జాతీయ అహింసా దినోత్సవం (International Day of Non-Violence) వేడుకలు.
వివిధ మతాల మధ్య అవగాహన కల్పించే సెమినార్లు.
కరుణ, సమగ్రత, గౌరవ భావం, బాధ్యత, సేవను ప్రోత్సహించే వాక్ ఫర్ వాల్యూస్(Walk for Values) కార్యక్రమం.
అలాగే కమ్యూనిటీ గ్రూప్లతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వివాదాల పరిష్కారం, శాంతి నిర్మాణంలో విద్యను అందించడం, యువజన నాయకత్వ కార్యక్రమాలను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలతో సంస్థ ముందుకు వెళ్లనుంది. వివిధ నేపథ్యాల ప్రజలు ఒకరితో ఒకరు మమేకమయ్యేలా తగిన వేదికలను సృష్టిస్తామని, అహింసను, పరస్పర గౌరవాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తామని చైర్మన్ విజయ్ పాటిల్ పేర్కొన్నారు.








