పిల్లలకు స్కూల్ బ్యాగ్ కిట్ పంపిణీ చేసిన తానా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ – అట్లాంటిక్ చాప్టర్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు బ్యాగ్, ఇతర వస్తువులను పంపిణీ చేసింది. ఇందులో భాగంగా హ్యారీస్ బర్గ్ లోని డౌనీ స్కూల్ విద్యార్థులకు బ్యాగులు, ఇతర వస్తువులను పంపిణీ చేశారు. కొత్త అకాడమిక్ ఇయర్ ను అత్యంత ఉత్సాహంగా, ధైర్యంగా ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
స్థానికంగా వుండే కమ్యూనిటీకి తమ వంతు సహాయ సహకారాల కింద తానా ప్రతి యేటా ‘‘గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ’’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ సారి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

తానా ఈవీపీ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ సాయి బొల్లినేని, తానా బెనిఫిట్స్ కో ఆర్డినేటర్ వెంకట్ సింగు, తానా మిడ్ అట్లాంటిక్ రీజినల్ రెప్రజెంటేటివ్ ఫణి కంతేటి కూడా దీనికి తోడ్పాటును అందించారు.
మరోవైపు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన వాలెంటీర్లకు, స్పాన్సర్లకు, షిన్ టెక్ ఇంక్, బ్రైట్ రేట్ మోర్ట్ గేజ్ ఎల్ఏసీ నిర్వాహకులకు మిడ్ అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు ప్రకటించింది.








