ఉత్సాహంగా, ఉల్లాసంగా ముగిసిన GRTA 6A6 క్రికెట్ టోర్నమెంట్
గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన GRTA 6A6 క్రికెట్ టోర్నమెంట్ వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా క్రీడాకారులు చూపిన క్రీడాస్ఫూర్తి, ఉత్సాహంతో ఈ టోర్నమెంట్ అందర్నీ విశేషంగా ఆకర్షించింది కూడా. క్రీడాకారులు తమ ఆట ప్రతిభతో అందర్నీ మంత్రముగ్ధులను చేశారు. ఈ టోర్నమెంట్ చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆటగాళ్లు, చూసేందుకు వచ్చిన వారు కూడా ప్రకటించారు. GRTA- TOGETHER WE GROW అన్న థీమ్ తో ఈ టోర్నమెంట్ జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపిన ఆటగాళ్లు, జట్లు, విజేతలు, రన్నరప్లు మరియు ప్రతి ఒక్కరికీ కూడా GRTA ధన్యవాదాలు ప్రకటించింది. క్రీడాకారుల క్రీడాస్ఫూర్తి, శక్తి, ఉత్సాహం ఈ టోర్నమెంట్ ను గొప్ప విజయంగా నిలిపాయి. మరో వైపు విజేతలు & రన్నరప్లందరికీ అభినందనలు అని నిర్వాహకులు ప్రకటించారు.

డివిజన్ I
విజేత – సాండ్లర్ సేన
రన్నరప్ – టి2ఐ ట్రక్
డివిజన్ II
విజేత – డెక్కన్ వారియర్స్
రన్నరప్ – ఎంసిసి
డివిజన్ III
విజేత – టైటాన్స్
రన్నరప్ – సాండ్లర్ థండర్స్
అలాగే ప్రతి జట్టుకు కూడా నిర్వాహకులు ధన్యకవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంట్ ని విజయవంతంగా నిర్వహించిన స్పోర్ట్స్ సెక్రెటరీ స్నేహిత్ రెడ్డికి జీఆర్టీఏ సభ్యులు అభినందనలు తెలిపారు. అలాగే డైరెక్టర్లు రమేశ్, యుకి, వాలంటీర్లు కిరణ్, భాను, మాహి, రాజా, రామ్ కి, అందరికీ కూడా ధన్యవాదాలు ప్రకటించారు.
మరోవైపు 44 జట్లకు అత్యంత ఉదారంగా టీ షర్టులు అందించిన శేఖర్ రెడ్డికి, అలాగే వెజిటేబుల్ బిర్యానీని స్పాన్సర్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే చికెన్ బిర్యానీ, సాయంత్రం స్నాక్స్ అందించిన మార్కెట్ కేప్ కి, చికెన్ బిర్యానీ స్పాన్సర్ చేసిన నవరసకి, టీ, వెజ్ బిర్యానీ ఇచ్చిన టీవా కి, రవి గుత్తా, బెస్ట్స్మైల్స్, SCOR, రిచ్మండ్ యూత్ క్రికెట్ (వాసు & DRS), శంకర్ మాకినేని రియల్టర్, కుమోన్ షార్ట్పంప్, లవర్న్టెక్ (సూరజ్ రెడ్డి కి కూడా GRTA టీమ్ ధన్యవాదాలు ప్రకటించింది.








