రాజా సాబ్ దెబ్బ.. మారుతి కొత్త ప్లాన్ రెడీ!
డైరెక్టర్ మారుతి(maruthi) టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ బడ్జెట్తో ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్లు అందుకున్న ఆయన, కొన్నిసార్లు ఫ్లాపులు ఎదురైనా నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చే డైరెక్టర్ గా పేరు తెచ్చుకోలేదు. అయితే ప్రభాస్తో తెరకెక్కించిన రాజా సాబ్(rajasaab) మాత్రం ఆయన కెరీర్పై గట్టి ప్రభావం చూపించింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా కథ, కథనంపై విమర్శలు రావడంతో మారుతి నెక్ట్స్ మూవీ ఎంపికపై ఆసక్తి నెలకొంది.
రాజా సాబ్ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న మారుతి, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం కథలపై దృష్టి పెట్టారు. పలువురు యంగ్ హీరోలను సంప్రదించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఏ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పుడు ఆయన తనకు బాగా పట్టున్న జానర్లోనే మరో సినిమా చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈసారి స్టార్ హీరోల కోసం ఎదురుచూడకుండా కొత్త నటీనటులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి మారుతి రెడీ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం మారుతి తన తర్వాతి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ను పూర్తి చేసి, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నారు. నవంబర్లో షూటింగ్ ప్రారంభించి, వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయాలనేది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశముంది. కొత్త హీరో హీరోయిన్లతో తెరకెక్కనున్న ఈ సినిమా మారుతికి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. రాజా సాబ్తో ఎదురైన చేదు అనుభవాన్ని మరిచిపోయి, తనదైన శైలిలో తిరిగి సక్సెస్ అందుకోవాలని మారుతి ప్రయత్నిస్తున్నారు.








