తానా మిడ్ అట్లాంటింక్ విభాగంఆధ్వర్యంలో ‘‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’’
తానా మిడ్ అట్లాంటింక్ విభాగంఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మెన్స్ డే నిర్వహించనున్నారు. నవంబర్ 15 వ తేదీన, ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం 399 ARCOLA RD, COLLEGEVILLE, PA19426 లో జరగనుంది.
ఇంటర్నేషనల్ మెన్స్ డే లో భాగంగా ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ యోగా, మెడిటేషన్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. యోగా నమస్కారాలు, నాడీ శుద్ధి, మిరాకిల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి రోజు వుండే ఒత్తిడిని జయించడానికి మన బలాన్ని, ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి? ఇన్నర్ బ్యాలెన్స్ ఎలా పెంచుకోవాలో కూడా ఇందులో అభ్యాసం చేయిస్తారు.
ఇవి కూడా చదవండి
అయితే.. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు కచ్చితంగా సొంతంగా తమ ‘‘యోగా మ్యాట్’’ ను తెచ్చుకోవాల్సి వుంటుందని నిర్వాహకులు తెలిపారు. పరిమిత సీట్లను మాత్రమే అందుబాటులో వుంటాయని, ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మరో వైపు https://tinyurl.com/2e55synf లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇక.. ఈ కార్యక్రమంలో పాఠశాల సంస్థ కూడా పాలుపంచుకుంటోంది. CHUGH ఫైనాన్సియల్ సర్వీసెస్, ASPIRING EAGLES, OAKSTON లాంటి సంస్థలు స్పాన్సర్స్ గా వున్నాయి.
కార్యక్రమ వివరాలు :
నవంబర్ 15
ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
వేదిక : 399 ARCOLA RD, COLLEGEVILLE, PA19426
ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఎవరి యోగా మ్యాట్ లు వారే తెచ్చుకోవాలి.








