హైదరాబాద్లో ‘కాన్స్టెల్లా’ కోర్ట్యార్డ్ విల్లాస్.. 27 ఎకరాల్లో 183 విల్లాలు
ఆర్జీఐ ఎయిర్పోర్టుకు 10 నిమిషాల దూరంలో 4,250 నుంచి 5,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో విల్లాలు అందుబాటులోకి తెస్తోంది ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్పీడ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పీ (Speed Infra Developers LLP). హైదరాబాద్లో ప్రీమియం విల్లా ప్రాజెక్టులపై ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించేందుకు ‘కాన్స్టెల్లా – కోర్ట్యార్డ్ విల్లాస్’ (Constella – Courtyard Villas) పేరుతో ఈ ప్రాజెక్టును తెచ్చింది. తుక్కుగూడ, ఎగ్జిట్–14 సమీపంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 10 నిమిషాల దూరంలో, ఫ్యూచర్ సిటీకి 15 నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
27 ఎకరాల్లో 183 విల్లాలు
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్టును 27 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 183 విల్లాలు, 15 ప్రత్యేకమైన కోర్ట్యార్డ్లు ఉంటాయని వెల్లడించింది. ఒక్కో విల్లా విస్తీర్ణం 4,250 నుంచి 5,400 చదరపు అడుగుల వరకు ఉంటుందని తెలిపింది. విల్లాలు 342, 300, 270 చదరపు గజాల విస్తీర్ణాల్లో ఉంటాయని తెలిపింది. అలాగే కోర్ట్యార్డ్ల చుట్టూ ఇళ్లను నిర్మించే సంప్రదాయ భావనను ఆధునిక జీవనశైలితో కలిపి ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రకృతితో అనుబంధానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకమైన గార్డెన్లు, పచ్చదనంతో కూడిన ప్రదేశాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. మొత్తం 15 ప్రత్యేకమైన గార్డెన్లు ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి
క్లబ్హౌస్తో పాటు ఇతర సౌకర్యాలు
ఏకంగా 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్హౌస్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. అయితే క్లబ్హౌస్లో అందుబాటులో ఉండే ప్రత్యేక సౌకర్యాల వివరాలను ఇంకా వెల్లడించలేదు. ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాల కోసం +91 98661 81246 నంబర్ను లేదా సంస్థ వెబ్సైట్: constella.in ను సంప్రదించవచ్చు.








