ఎంత సంపాదించినా ధనవంతులు కాలేరు.. డబ్బు, ఆస్తి మధ్య తేడా ఇదే!
డబ్బు సంపాదించడం, ఆస్తిని పెంచుకోవడం రెండూ ఒక్కటేనా? దీని విషయంలో ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? ఒకదానితో ఒకటి సంబంధం వుందా? లేదా రెండు రెండు వేర్వేరా? నిజానికి చెప్పాలంటే రెండూ వేర్వేరు. అసలు సంబంధమే లేదు.
డబ్బు సంపాదించడం అంటే.. మన శ్రమకు వచ్చే ఆదాయం

డబ్బు సంపాదించడం అంటే మన మన శ్రమ మీద ఆధారపడి వుంటుంది. మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తి ద్వారా ప్రతి నెలా మీ చేతికి వచ్చే ఆదాయాన్ని డబ్బు సంపాదించడం అంటారు. ఇది కొన్ని రోజుల వరకు తాత్కాలికమే. మనం పని చేయడం ఆపేస్తే, ఆదాయం కూడా ఆగిపోతుంది. అంతెందుకు.. మనం మన ఆఫీసులకు సెలవులు పెడితే, డబ్బులు కూడా కట్ అవుతాయి. దీంతో మన మన ఆదాయాలు ఆగిపోతాయి.
ఇవి కూడా చదవండి
ఈ డబ్బు అనేది రోజువారీ ఖర్చులు, ఇండ్ల అద్దెలు, EMIలు మరియు ప్రస్తుత జీవనశైలిని గడపడానికి ఉపయోగపడుతుంది.కేవలం డబ్బు సంపాదించడం వల్ల మాత్రమే ఎవరూ ధనవంతులు కాలేరు. ఎంత ఎక్కువ సంపాదించినా, దానికి తగ్గట్టు ఖర్చులు పెరిగితే చేతిలో ఏమీ మిగలదు. మన మన ఖర్చులు, జీవన శైలి అవసరాలను తీరుస్తాయి.
ఆస్తి పెంచుకోవడం అంటే.. సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడం

ఇక.. ఆస్తి పెంచుకోవడం అంటే.. సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేసి, దానిని సరైన చోట పెట్టుబడి పెట్టడమే ఆస్తిని పెంచుకోవడం. దీని ద్వారా కాలక్రమేణా దాని విలువను పెంచుకోవడాన్ని ఆస్తి పెంచుకోవడం అంటారు. అయితే.. ఆదాయం శాశ్వతం కాదు. ఆస్తి మాత్రం శాశ్వతం.
అయితే.. ఆస్తి రకరకాల రూపాల్లో వుండొచ్చు. ఇల్లు, బంగారం, ఇతర వస్తువులు… ఏదైనా కావొచ్చు. రియల్ ఎస్టేట్, బంగారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, లేదా స్థిర డిపాజిట్లు (FD) వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆస్తులు పెరుగుతాయి. ఓ రకంగా మనకు ఆర్థిక స్వాతంత్రం దొరికినట్లు లెక్క.








