హైదరాబాద్‌లో లగ్జరీ లివింగ్‌కు కొత్త అడ్రస్.. నిజాంపేటలో ‘ఐఆర్ఏ టవర్స్’!
సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారు ఇల్లు కొనే ముందు ఎన్నో విషయాలు చూస్తారు. ఎన్ని గజాలు? ఏ ఏరియా? సెక్యూరిటీతో పాటు కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోయే సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది ఆలోచిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న సిటీలో అపార్ట్మెంట్ కొనుగోలు చేసేవారికి లైఫ్‌స్టైల్ సదుపాయాలు కూడా కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాంపేటలోని ఏఎసఆర్ నగర్ ప్రాంతంలో ‘ఐఆర్ఏ టవర్స్’ పేరుతో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. వీ4 వెంచర్స్ (V4 Ventures) ఇన్‌స్టాలో ఈ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించింది.
మూడు ఎకరాల్లో ప్రీమియం వెంచర్
నగరంలో సొంతింటి కోసం చూస్తున్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు కంపెనీ చెప్తోంది. మొత్తం మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో డబుల్, త్రిబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లు కట్టనున్నారు. మూడు బ్లాకులతో కూడిన ఈ ప్రాజెక్ట్‌లో సెల్లార్, స్టిల్ట్తో పాటు పది అంతస్తుల బిల్డింగ్ ప్లాన్ వేశారు. ఫ్లాట్ల సైజు విషయానికొస్తే.. 1,150 నుంచి 1,840 చదరపు అడుగుల వరకు ఉంటుందని కంపెనీ చెప్తోంది. చిన్న కుటుంబాల నుంచి ఎక్కువ స్థలం కోరుకునే కుటుంబాల వరకు వేర్వేరు అవసరాలకు అనుగుణంగా ఈ ఫ్లాట్ సైజులు ఉండనున్నాయి.
18,600 చదరపు అడుగుల క్లబ్‌హౌస్
ఈ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్లబ్‌హౌస్ గురించి. ఏకంగా 18,600 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంతో క్లబ్‌హౌస్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. సాధారణంగా అపార్ట్మెంట్ లైఫ్‌లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా వ్యాయామం, వినోదం, విశ్రాంతి వంటి కార్యకలాపాలకు అవకాశం ఉండటం అదనపు ప్రయోజనంగా భావిస్తారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఫెసిలిటీస్‌ను ఒకే చోట అందించనున్నట్లు తెలుస్తోంది. బాంక్వెట్ హాల్, అడ్మిన్ ఆఫీస్, కాఫీ షాప్, క్రెచ్, గెస్ట్ రూమ్స్, మోడ్రన్ జిమ్, యోగా అండ్ స్పా, ఇండోర్ గేమ్స్, సెలూన్ వంటి సదుపాయాలు ఇక్కడ ఉండబోతున్నాయి. అలాగే అవుట్డోర్ గేమ్స్‌కు సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
భద్రతకు ప్రాధాన్యం
గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకునే సమయంలో భద్రతకు కూడా కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఐఆరఏ టవర్స్‌లో 24 గంటలు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ప్రధాన ఫీచర్‌గా ఉండనుంది.
నిజాంపేటలో సొంతింటి కోసం చూస్తున్నవారికి..
హైదరాబాద్‌లోని నిజాంపేట, ఏఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఇల్లు కొనాలనుకునేవారికి ఐఆర్ఏ టవర్స్ మరో మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. మూడు ఎకరాల విస్తీర్ణం, వివిధ సైజుల్లో 2, 3 BHK అపార్ట్మెంట్లు, పెద్ద క్లబ్‌హౌస్, సెక్యూరిటీ సదుపాయాలు ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కంపెనీ వెబ్ సైట్‌ను చూడండి.
కంపెనీ వెబ్ సైట్ www.v4ventures.in
ఇ-మెయిల్ [email protected]
ఫోన్ 8500909192, 8500303132








