మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు కేసీఆర్, బంధువుల యత్నం: సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్
మియాపూర్ లో రూ. 50 వేల కోట్ల విలువైన భూముల ప్రభుత్వానికి చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది
సుప్రీంకోర్టు కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా
మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా ప్రయత్నించారు
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని విలువైన భూములు కబ్జాకు ప్రయత్నించారు
ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా ఈ కబ్జా వ్యవహారాలపై పోరాడడంతోనే కక్ష గట్టి నన్ను జైలుకు పంపారు
మియాపూర్ భూముల విషయంలో దామోదర్ రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లు లంచంగా ఇచ్చారు
కేసీఆర్ కు నగదు రూపంలో ముడుపులు ఇచ్చారు
మేం ఈ భూముల రక్షణకు ప్రభుత్వo తరఫున బలమైన వాదనలు వినిపించాం
తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో ఆ భూముల రక్షణకు సరైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించా
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కబ్జాల నుంచి భూములను రక్షించే ప్రయత్నిస్తున్నాం
ఈ విలువైన భూములను విక్రయించి నీటిపారుదల, విద్యా, వైద్య తదితర రంగాలకు కేటాయిస్తాం
ఈ అంశంపై క్యాబినెట్ లో చర్చిస్తాం
మా ప్రభుత్వం వచ్చాక రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించాం
IMG భూములను భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై కేటీఆర్ కొట్టేయాలని చూస్తే న్యాయపోరాటంతో అడ్డుకున్నాం
కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు బీఆర్ ఎస్ నాయకులు ప్రయత్నిస్తే న్యాయపోరాటంలో గెలిచాం
గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జాకు ప్రయత్నిస్తే సుప్రీం కోర్టులో పోరాడాం
ప్రభుత్వం పోరాటంతో ఆది అటవీ భూమి అని సుప్రీం కోర్టు తెల్చి చెప్పింది
మంచిరేవుల లో 143 ఎకరాల భూమిని కేటీఆర్ రాయలసీమ బిల్డర్స్ తో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తే దానిని రక్షించాం
అందులో పోలీసుల పిల్లలకోసం స్కూల్ పెట్టాం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కు నజరానాగా అప్పగిస్తే సుప్రీం కోర్టులో పోరాడి రక్షించాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ ఎస్ నాయకుల భూ ఆక్రమణలను అడ్డుకున్నాం
మా ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో రూ. 1.50 లక్ష కోట్ల విలువైన భూమలు రక్షించాం
వనరుల సమీకరణకు నియమించిన మంత్రివర్గం ఉప సంఘం ఈ భూముల విక్రయం.. వచ్చే ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై అధ్యయనం చేస్తుంది
హరీష్ రావు మామ హనుమంత రావు కబ్జా పెట్టిన భూములు సర్వే చేయకుండా అధికారులను అడ్డుకుంటున్నారు
కోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు
భూముల ఆక్రమణపై బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారు
శాసనసభ లో చర్చించి చర్యలకు దిగితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు
మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎందుకు బీఆర్ఎస్ నాయకులు స్పందించడం లేదు
కనీసం రెవెన్యూ అధికారులను ఎందుకు బీఆర్ఎస్ నాయకులు అభినందించడం లేదు
పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీష్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పై కేసులు వేశారో వారితో కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారు
మియాపూర్ భూములపై ఇప్పటికైనా కుట్రలు మానాలి
మియాపూర్ భూముల విక్రయంతో వచ్చే నిధులను విద్యాభివృద్ధికి వినియోగిస్తాం
వాళ్ల భూముల ఆక్రమణలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సీఎం డిమాండ్
రెండు గ్రామాల మధ్య వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారు
అక్కడి ఆక్రమణలను తేల్చి శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తాం
కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా బుద్ది మార్చుకుని, ఆక్రమణలు చేయడం మానుకోవాలి
వాళ్ల ఆక్రమణలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి








