ఇండో అమెరికన్ కల్చరల్ ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ జెర్సీ ఆధ్వర్యంలో ఘనంగా గర్భా ఉత్సవం
ఇండో అమెరికన్ కల్చరల్ ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ జెర్సీ (IACFNJ)అక్టోబర్9,10 తేదీల్లో సౌత్ బ్రన్స్ విక్ హైస్కూల్ లో సౌత్ బ్రన్స్ విక్ గర్భా 2026 ని విజయవంతంగా నిర్వహించింది. ఈ గర్భా కార్యక్రమంలో పాల్గొనడానికి సెంట్రల్ న్యూజెర్సీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది తరలి వచ్చి, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రెసిడెంట్ డా. తుషార్ బి. పటేల్ ఆధ్వర్యంలో సాగింది.
రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో సాంప్రదాయ గర్బా, ఉత్సాహభరితమైన దండియా రాస్, మరియు ప్రసిద్ధ గుజరాతీ జానపద నృత్యమైన సనేడో వంటివి ప్రదర్శించారు. అన్ని వయస్సుల వారు ఇందులో పాల్గొన్నారు. దీంతో సంగీతం, ఉత్సాహం, సామూహిక స్ఫూర్తితో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఈ రెండు రోజుల పాటు అంబా అమ్మ వారికి హారతి, ప్రార్థనల తర్వాత గర్భా, దాండియా, రాస్ నృత్యాలను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి సౌత్ బ్రన్స్విక్ మేయర్ చార్లెస్ కార్లీ, డిప్యూటీ మేయర్ కెన్ బీర్మన్, కౌన్సిల్ సభ్యురాలు అర్చన గ్రోవర్, సౌత్ బ్రన్స్విక్ పోలీస్ చీఫ్ జేమ్స్ ర్యాన్, సౌత్ బ్రన్స్విక్ విద్యా బోర్డు సభ్యులు బారీ నాథన్సన్, మైక్ మిచెల్, మరియు రాజా కృష్ణ, నార్త్ బ్రన్స్విక్ విద్యా బోర్డు సభ్యుడు మన్‌ప్రీత్ సింగ్, కమ్యూనిటీ మద్దతుదారులు ముకుంద్ థాకర్, సునీల్ నాయక్, కౌశిక్ వ్యాస్, రితేష్ షా, రూపేన్ పటేల్ మరియు కేతన్ షా సహా పలువురు ప్రముఖ స్థానిక నాయకులు మరియు ఎన్నికైన అధికారులు హాజరయ్యారు. సాంస్కృతిక అవగాహన, వైవిధ్యం మరియు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి IACFNJ చేస్తున్న ప్రయత్నాలకు సమాజం మద్దతు లభించినట్లయ్యింది.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు, స్థానిక వ్యాపారులు, వాలంటీర్లు కూడా సహకరించారు. బాస్మతి రైస్, రెప్రెస్ ఫుడ్స్ సంస్థలు బెస్ట్ డ్రెస్ డాన్స్ పోటీలను స్పాన్సర్ చేశాయి. మిడిల్స్ కల్చరల్ ఆర్ట్స్, పటేల్ బ్రోత్ ఇంటర్నేషనల్, డా. నవీన్ మెల్ కేర్, ఎంపీ ఇంజనీర్స్, మరియు రూబీ వంటి ప్రధాన సంస్థలు ఉత్తమ వస్త్రధారణ కలిగిన మహిళలను గుర్తించి ఉదారంగా విరాళాలు అందించాయి. రేష్మా నాంగియా హెరిటేజ్ ప్రిన్స్టన్ కూడా ఈ కార్యక్రమానికి సహకరించింది. ప్లెయిన్స్బోర్ గోలా ఎక్స్‌ప్రెస్‌లోని ఝోప్రి రెస్టారెంట్ రుచికరమైన ఆహారాన్ని అందించింది.

సౌత్ బి గర్బా 2026 సాంస్కృతిక వారసత్వానికి మరియు సమాజ ఐక్యతకు ఒక వేడుకగా నిలిచింది. వివిధ తరాలకు, నేపథ్యాలకు చెందిన వేలాది మంది ప్రజలను ఒకచోట చేర్చింది ఈ కార్యక్రమం. సాంస్కృతిక సంబంధాలను బలపరుస్తూ, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని నెలకొల్పింది. గొప్ప భారతీయ సంప్రదాయాలను అందరికీ తెలిసేలా చేసింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మిడిల్సెక్స్ కౌంటీ కల్చరల్ ఆర్ట్స్, పటేల్ బ్రదర్స్, ఓహెచ్ఎం ఇంటర్నేషనల్, డా. నవీన్ మెహతా, అరిస్టా కేర్, ఎంపీ ఇంజనీర్స్, పతిదార్ సూపర్ మార్కెట్, మరియు రూబీ మెమోరియల్ వారికి ధన్యవాదాలు ప్రకటించారు. ప్లెయిన్స్‌బోరోలోని ఝోప్రి రెస్టారెంట్ మరియు ఐస్ గోలా ఎక్స్‌ప్రెస్ వారికి రుచికరమైన ఆహారాన్ని అందించినందుకు ధన్యవాదాలు ప్రకటించారు. అన్నింటికన్నా ముఖ్యంగా, మా అవిశ్రాంత IACFNJ కార్యనిర్వాహక కమిటీ, ధర్మకర్తల మండలి, వాలెంటీర్లకు కూడా ధన్యవాదాలు ప్రకటించారు.
మరిన్ని వివరాలకు https://www.facebook.com/www.iacfnj.org,www.IACFNJ.org వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.








