తొమ్మిదో నెలలోనూ తగ్గని సమంత జోరు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు(samantha ruth prabhu) తన జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. భర్త రాజ్ నిడిమోరు(Raj nidimoru)తో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న ఆమె, ప్రెగ్నెన్సీ టైమ్ లోనూ పర్సనల్ లైఫ్ తో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించింది. ప్రస్తుతం తొమ్మిదో నెలలో ఉన్న సమంత తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. మా ఇంటి బంగారం(maa inti bangaram) సినిమా షూటింగ్ టైమ్ లోనే తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందని ఆమె వెల్లడించింది. తస్సదియ్యా సాంగ్ షూటింగ్ జరుగుతున్న టైమ్ లో ఈ విషయం తెలియగా, డైరెక్టర్ నందిని రెడ్డి(nandini reddy) స్పెషల్ కేర్ తీసుకుంటూనే షూటింగ్‌ను కంటిన్యూ చేసింది.
ఇక మా ఇంటి బంగారం(Maa inti bangaram) సినిమా సమంత కెరీర్లో ప్రత్యేక గుర్తింపును అందుకుంది. హీరోయిన్ గా ఆమె తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్ల మైల్‌స్టోన్‌ను చేరుకోవడం విశేషం. మరోవైపు ఏడో నెల గర్భిణిగా ఉన్న టైమ్ లోనే చెన్నైలో సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్ కార్యక్రమం కోసం షూటింగ్లో పాల్గొంది. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. తాజాగా మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు తాను చేసిన వ్యాయామాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది సమంత. డాక్టర్ల పర్మిషన్, నిపుణుల పర్యవేక్షణలోనే ప్రీనేటల్ వర్కౌట్స్ చేసినట్లు గతంలో క్లారిటీ కూడా ఇచ్చింది.
ప్రెగ్నెన్సీ టైమ్ లో శరీర సామర్థ్యాన్ని బట్టి వ్యాయామాలు మార్చుకుంటూ ముందుకు సాగిన సమంత, ఈ జర్నీలో తన శరీరం చెప్పే సంకేతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. మాతృత్వం తన జీవితంలో తీసుకురాబోయే మార్పుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సమంత. ఇప్పటికే పూర్తిచేయాల్సిన వృత్తిపరమైన బాధ్యతలను ముగించుకున్న ఆమె, బిడ్డ జన్మించిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీని ఫైనల్ ల్యాప్ గా అభివర్ణిస్తూ మాతృత్వానికి సిద్ధమవుతున్న సమంత మరో అందమైన బాధ్యతను స్వీకరించేందుకు రెడీ అవుతోంది.
View this post on Instagram








