సూర్య 49వ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూ, విభిన్న కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కెరీర్లో 49వ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మండాడి సినిమాతతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మతిమారన్(Mathimaran) ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. సూరి(Suri), సుహాస్(Suhas) ప్రధాన పాత్రల్లో వచ్చిన మండాడి(Mandadi) విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా తర్వాత మతిమారన్ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందట. కథలోని కొత్తదనం, యాక్షన్ ఎలిమెంట్స్ సూర్యను ఇంప్రెస్ చేశాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను(Kalaipuli S. Thanu) ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రాథమిక డిస్కషన్స్ పూర్తయ్యాయని, త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ ఏడాది కరుప్పు(Karuppu), విశ్వనాథ్ అండ్ సన్స్(Viswanath and sons) సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సూర్య(Suriya)కు మంచి సక్సెస్‌లు దక్కాయి. తాజాగా సీన్(Scene) సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఆవేశం(Aavesam) ఫేమ్ జీతూ మాధవన్(Jeethu madhavan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్(Nazriya nazim), నస్లెన్(Naslen) కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 6న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.








