కింగ్ నుంచి అనిరుధ్ అవుట్.. రంగంలోకి మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah rukh khan) నటిస్తున్న ప్రిస్టీజియస్ మూవీ కింగ్ రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించేందుకు ఎంపికైన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పాటూ పర్సనల్ లైఫ్ కు కొంత టైమ్ కేటాయించాలనే ఉద్దేశంతో ఆయన ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.
అయితే షారుఖ్ ఖాన్‌పై ఉన్న గౌరవంతో కింగ్ సినిమా కోసం అనిరుధ్ స్పెషల్ గా థీమ్ ట్రాక్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి ముందు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ ఖాన్‌లతో ఆయన పలుమార్లు డిస్కషన్స్ జరిపినట్లు బాలీవుడ్ టాక్. అనిరుధ్ ప్లేస్ లో ప్రముఖ సంగీత ద్వయం సచిన్(Sachin)– జిగర్(Jiger)ను మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే వారు సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మ్యూజిక్ విభాగంలో కీలక మార్పు చోటుచేసుకున్నట్లయింది.
మరోవైపు డిసెంబర్ 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు దీపికా పదుకొణె(deepika padukone), అభిషేక్ బచ్చన్(Abhishek bachan), సుహానా ఖాన్(Suhana khan) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అనిరుధ్ ప్లేస్ లో వచ్చిన సచిన్- జిగర్ ఎలాంటి మ్యూజిక్ ను అందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సంగీత దర్శకుడి మార్పుపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.








