నాదబ్రహ్మోత్సవం–26లో నాల్గవ రోజు “వేణు శ్రీ రంగం” సంకీర్తనా లహరి
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న నాదబ్రహ్మోత్సవం–26 నాల్గవ రోజు కార్యక్రమం సంకీర్తనా గానంతో ప్రముఖ గాయకుడు శ్రీ వేణు శ్రీరంగం సంకీర్తనా గానం జరిగింది. “చాలదా హరినామ సంకీర్తన”, “హరి అవతారం మీతడు అన్నమయ్య”, “అపని వర ప్రసాది”, “గోవిందా శ్రిత గోకుల బృందా” వంటి బహుళ ప్రచారం పొందిన కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.కీబోర్డ్ రాజు తబలా అజేయ్ సహకరించారు
ఈ కార్యక్రమానికి కళా రత్న శ్రీ సంజేయ్ కీశోర్ విశిష్ట అతిథిగా విచ్చేశారు. అన్నమయ్య కీర్తనలు కోసం మహా యజ్ఞం చేస్తూన్నారు ఆ యజ్ఞం ఫలితమే అన్నమయ్యపురం. ఎన్నో ఏళ్లుగా అలుపేరుగక శోభా రాజు గారు చేస్తూన్న సేవ నభూతో నభవిష్యతి అని కోనియాడారు.
అతిథిలను కళాకారులను సంస్థ అధ్యక్షురాలు డా శోభారాజు, మేనేజింగ్ ట్రస్టీ నందు కుమార్ సాలువా చిత్ర పటాన్ని ఇచ్చి సత్కరించారు. అనంతరం స్వామి వారి మంగళహారతి ప్రసాద వితరణ తో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.








