అక్టోబర్ 2026 ను ’’హిందూ హెరిటేజ్ మంత్’’ గా ప్రకటించిన లాథ్రోప్ నగర కౌన్సిల్
లాథ్రోప్ నగర కౌన్సిల్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.లాథ్రోప్ నగరంలో ‘‘అక్టోబర్ 2026’’ ను ‘‘హిందూ హెరిటేజ్ మంత్’’ గా ప్రకటిస్తూ కీలక నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు సభ్యులందరూ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఈ కీలక నిర్ణయం జరిగింది. ఈ కీలక నిర్ణయం ప్రకటించడం ద్వారా ఇకపై అక్టోబర్ 2026 హిందూ హెరిటేజ్ మంత్ గా పరిగణించనున్నారు.
హిందూ హెరిటేజ్ మంత్ అంటేహిందూ సమాజం యొక్క గొప్ప చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి మరియు వారి విశేష కృషిని గుర్తించి, వేడుకగా జరుపుకునే కార్యక్రమం లాంటిది. ఇలా నిర్ణయం తీసుకోవడంపై లాథ్రోప్ నగరంలోని హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కీలక నిర్ణయం తీసుకోవడం వెనుకలా సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ పాత్ర చాలా వుంది. ఈ నిర్ణయం వెలువడడానికి చేసిన ప్రయత్నంలో వున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ప్రకటించారు.








