సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి చేతులు మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నందినీ రెడ్డి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. ‘డెస్టినీ’ టైటిల్‌కి తగ్గట్టుగా సరిగ్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పోస్టర్లో కనిపించే సంకెళ్లు.. ఇమాన్యుయేల్ కనిపించే తీరు, పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్పబోతోన్నారని అర్థం అవుతోంది. టైటిల్ లోగోలోనూ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్లను ప్రకటించనున్నారు.
ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు.








