సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ 2026 లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్
• సమ్మిట్‌లో రూ.9.89 లక్షల కోట్ల విలువైన 303 ఎంవోయూలు చేసుకుంటాం.
• వీటితో కలిపి జూన్ 2024 నుంచి రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.32.49 లక్షల కోట్లు.
• సమ్మిట్‌లో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు. విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కు సంబంధించి 303 ఎంవోయూలు జరుగుతాయి.
• మొత్తం రూ.32.49 లక్షల కోట్ల పెట్టుబడి ఆసక్తి. జూన్ 2024 నుంచి రాష్ట్రానికి వచ్చిన రూ.22.60 లక్షల కోట్ల ప్రతిపాదనలకు సమ్మిట్‌లోని రూ.9.89 లక్షల కోట్లు కలిపి మొత్తం రూ.32 లక్షల కోట్లు
• సమ్మిట్ కు ముందు రూ.22.60 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులు.
• రూ.17.10 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాల ఆమోదం.
• రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధం. భూమి, ప్రోత్సాహకాల ఆమోదం పొందిన 526 ప్రాజెక్టుల్లో సంఖ్యాపరంగా 58 శాతం నిర్మాణ సన్నద్ధత దశకు చేరాయి.
• పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 160 గిగావాట్లు లక్ష్యం. ఇప్పటికే 114 గిగావాట్ల సామర్థ్యానికి ఆమోదం
• ఎలక్ట్రానిక్స్‌లో ఏటా రూ.4.20 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యం. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ విభాగాల్లో సుమారు రూ.31,926 కోట్ల విలువైన ప్రాజెక్టులకు రాష్ట్రం ఆమోదం
• ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రూ.50 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం. అంతరిక్ష రంగానికి విడిగా రూ.25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
• ఆహార శుద్ధి రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
• దేశ పోర్టు సరకు రవాణాలో 20 శాతం వాటా లక్ష్యం. పోర్టుల సామర్థ్యం, రైలు అనుసంధానం, నౌకా నిర్మాణ క్లస్టర్ల అభివృద్ధికి ప్రాధాన్యం
• ఐదో తరం యుద్ధవిమాన ప్రాజెక్టును 36 రోజుల్లో గ్రౌండింగ్ దశకు తెచ్చాం.
• సోలార్ తయారీలో భారీ సామర్థ్యానికి ఆమోదం. రాష్ట్రంలో 42 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ సామర్థ్యానికి, 53 గిగావాట్ల ఇంగట్, వేఫర్ తయారీ సామర్థ్యానికి ఆమోదం
• ఏపీలో 4.6 గిగావాట్ల డేటా సెంటర్ ప్రాజెక్టులకు ఆమోదం. దేశంలో అప్పటికే ఏర్పాటైన డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్లు
• అమరావతిలో 250 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్ తయారీ కేంద్రం. అమరావతి క్వాంటం వ్యాలీని దక్షిణాసియాలో తొలి ప్రాజెక్టు. 2027 ఫిబ్రవరి 3 తేదీన ప్రారంభిస్తాం.
• సరకు నిర్వహణలో దేశంలో ఏపీకి నాలుగో స్థానం. ప్రస్తుతం పనిచేస్తున్న ఆరు పోర్టుల వార్షిక సామర్థ్యం 346 మిలియన్ టన్నులు. 2025–26లో 209 మిలియన్ టన్నుల సరకు నిర్వహణ
• నాలుగు కొత్త పోర్టులతో అదనంగా 108 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం. రామాయపట్నం పోర్టుకు 2027 ఏప్రిల్, మూలపేటకు జూన్, మచిలీపట్నానికి డిసెంబర్, కాకినాడ గేట్‌వేకు 2028 సెప్టెంబర్ లక్ష్యం
• మూడు నౌకా నిర్మాణ క్లస్టర్లు, ఏడు కొత్త ఫిషింగ్ హార్బర్లు. దుగరాజపట్నం నౌకా నిర్మాణ క్లస్టర్‌కు 2028–29 కాలపరిమితి
• ఏపీలో ప్రస్తుతం ఆరు విమానాశ్రయాలు. వీటి వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం 1.55 కోట్లు కాగా, 2025–26లో 62 లక్షల మంది ప్రయాణించారు.
• తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ప్రణాళిక. భోగాపురం, అమరావతి, తిరుపతిని ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేసి, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా గంటలో విమానాశ్రయానికి చేరుకునేలా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం.
• ఏపీ మీదుగా 839 కి.మీ. హైస్పీడ్ రైలు కారిడార్లు. ప్రతిపాదిత హైస్పీడ్ రైలు మార్గాలతో పాటు 4,415 కి.మీ.
• పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి జాతికి అంకితం చేయాలన్నది లక్ష్యం
• పోలవరం–బనకచర్ల అనుసంధానానికి సుమారు 200 టీఎంసీల ప్రతిపాదన. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఐదు నదులు, నాలుగు రాష్ట్రాలకు జలభద్రత కల్పించాలన్నది మా ఆలోచన
• రాష్ట్రవ్యాప్తంగా 25 రంగాలవారీ పారిశ్రామిక పార్కులు. శ్రీకాకుళంలో కెమికల్ పార్క్, విశాఖలో మెడ్‌టెక్, అనకాపల్లిలో ఉక్కు అనుబంధ పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, ఏఐ డేటా సెంటర్ వంటి రంగాలను గుర్తించారు.
• స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంగా పని చేస్తున్నాం








