ఆయనకు క్రెడిటే లేదు .. చోరీ ఎక్కడిది : మంత్రి సంధ్యారాణి
వైసీపీలోని కొందరు నేతలు ప్రజలకు నీతులు చెబుతున్నారని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ నేరాలు చేసిన నేతలు ఎక్కడున్నా తీసుకొచ్చి శిక్షిస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport)పై వైసీపీ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. మేం చేసిన పనులను జగన్ (Jagan) క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఆయనకు క్రెడిటే (credit) లేదు. చోరీ ఎక్కడిది. క్రెడిట్ అనే పదం జగన్కు వర్తించదు. ఆయన క్రెడిట్ అంటే నాలుగు కత్తులు, నాలుగు గొడ్డళ్లు. హత్యలు చేసినవాళ్లని వెనకేసుకుని రావడం, బూతులు మాట్లాడిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వడమే ఆయనకు తెలుసు. శస్త్రచికిత్స చేయించుకున్న సొంత చెల్లినే పరామర్శించలేదు. నేరాలు చేసి జైళ్లలో ఉన్నవారిని మాత్రం జగన్ పరామర్శిస్తున్నారు అని విమర్శించారు.








