ఆటా మహా సభల్లో అలరించిన మురళీధర్ గౌడ్
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ఘనంగా ముగిసిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యూత్ కన్వెన్షన్లో ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వేదికపై మాట్లాడటం తన మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెబుతూ ఆటా నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీస్సులు , ప్రేక్షకుల ఆశీర్వాదాల వల్లే తాను ఈరోజు ఇంత పెద్ద వేదికపై తమ ముందు నిలబడగలిగానని మురళీధర్ గౌడ్ భావోద్వేగంతో పేర్కొన్నారు. తనను ఇలాగే ఆశీర్వదించాలని, ప్రేక్షకులను అలరించడానికి ఇంకా కృషి చేస్తానని తెలిపారు. రెండు ఫ్లైట్లు మార్చి మరీ ఇంత దూరం అమెరికాకు వచ్చామని, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తమ అభిమాన డైలాగ్స్ చెప్పకపోతే ఎలా అంటూ ఆయన స్టేజ్ పైనే తన సినిమాల్లోని ప్రముఖ డైలాగ్స్ చెప్పి అలరించారు.








