ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు : ఈటల
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress government) అన్ని వర్గాలను మోసం చేస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) విమర్శించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ యువత, మహిళలు, ఎస్సీ (SC), ఎస్టీ, బీసీ (BC), మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఆ పార్టీ పట్ల రాష్ట్రంలో వ్యతిరేకత ఉందని, మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. హైడ్రా ( Hydra) ప్రజల ఇళ్లు కూల్చే సంస్థగా ముద్ర పడిందని ఆక్షేపించారు. 95 శాతం ప్రజలు దీనికి భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. నగరంలో అనేక చెరువులు, కుంటలు మాయమయ్యాయని, వాగులు, డ్రైనేజీలు కెమికల్ వేస్ట్‌గా మారిపోయాయని విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న కొత్తకాలనీలు చెరువు పక్కన ఉంటే దుర్గంధం అవుతున్నాయని ఆక్షేపించారు.








