కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన హరీశ్‌రావు
తెలంగాణ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ (Addanki Dayakar), సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy)కి బీఅర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao) తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. హరీశ్‌రావుపై నిరాధార ఆరోపణలు చేశారని, ప్రతిష్ఠకు భంగం కలించారని అందులో పేర్కొన్నారు. హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశారని అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన న్యాయవాది (Lawyer) ద్వారా హరీశ్ లీగల్ నోటీసులు పంపించారు.








