గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ పనుల్లో వేగం పెంచండి : డిప్యూటీ సీఎం పవన్
తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, కోతల నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ పనుల్లో వేగం మరింత పెరగాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. గేట్ గ్రీన్ వాల్ |(Gate Green Wall) పనుల పురోగతిపై అటవీశాఖ ఉన్నతాధికారులతో పవన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను వచ్చే రెండు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. డివిజన్లవారీగా (Divisions) నిర్దేశించిన లక్ష్యాలు ఎంత వరకు పూర్తి చేశారు? ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు. ఈ ఏడాది మడ అడవులు ఎంత విస్తీర్ణంలో నాటనున్నారు? తదితర వివరాలను అంశాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్యసాధనలో భాగంగా గత రెండేళ్లలో సాధించిన పురోగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిన అంశాన్ని పవన్ గుర్తు చేశారు. మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం సాధించేందుకు కృషి చేసిన అధికారుల (Officials)కు అభినందనలు తెలిపారు.








