ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మహూర్తం ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings) ఈ నెల 17న ప్రారంభమై 28 వరకు జరిగే అవకాశం ఉన్నందున, కూటమి ఎమ్మెల్యేలు 100 శాతం హాజరుకావాలని ప్రభుత్వ విప్ల సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుతానికి సభ నాలుగు రోజులు ఉంటుందకున్నా, ఎన్ని రోజులు ఉంటాయో 17న శాసనసభ వ్యవహారాల సలహా కమిటి (బీసీఏ)లో తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) మాట్లాడుతూ ప్రజాసమస్యలపై చర్చించేందుకైనా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావాలని అన్నారు. డీఎస్సీ-2025పై దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. డీఎస్సీ (DSC)పై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan) ప్రజా సమస్యలు పక్కనపెట్టి శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.








