ది న్యూయార్క్ టైమ్స్ కథనం సంతోషకరం : చంద్రబాబు
అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా నిర్మించడం మాత్రమే కాదు, దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలకు ఓ బెంచ్ మార్క్‌గా నెలకొల్పడం కూడా మా లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు. అమరావతి(Amaravati) నిర్మాణం గురించి ది న్యూయార్క్ టైమ్స్ (New York Times) పత్రికలో కథనం ప్రచురితమవ్వడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజన్ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమవ్వడం సంతోషకరం. పచ్చదనంతో సమర్థంగా, అందరికీ నివాసయోగ్యంగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా రూపుదిద్దుకుంటున్న నగరం అమరావతి. అంతర్జాతీయ స్థాయి పట్టణ జీవనవిధానం కల కాదని, భారతదేశం (India)లో దాన్ని నిర్మించగలదని అమరావతి నిరూపించి చూపుతుంది. మా లక్ష్యం మహత్తరమైంది. అలాగని అసాధ్యం కాదు అని చంద్రబాబు పేర్కొన్నారు.








