ఒకేసారి రెండు ప్రాజెక్టులు.. నాగచైతన్య ప్లానింగ్ మామూలుగా లేదుగా!
నాగచైతన్య(Naga chaitanya) ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ షెడ్యూల్లో ఉన్నారు. తండేల్(thandel) సక్సెస్ తర్వాత ఆయన కథల ఎంపికలో కొత్త దారిని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ కార్తిక్ దండు(Karthik dandu) తెరకెక్కిస్తున్న మిస్టిక్ హారర్ థ్రిల్లర్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. విరూపాక్ష(Virupaksha)తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ దండు, ఈ సినిమాను పురాణాంశాలు, మిస్టిక్ హారర్ ఎలిమెంట్స్ కలగలిపిన విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. టీజర్ రిలీజై కొన్ని నెలలు గడిచినా తర్వాతి అప్డేట్లు రాకపోవడంతో సినిమా పురోగతిపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కీలక దశలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ కు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మేకర్స్ డిసెంబరు రిలీజ్ టార్గెట్ గా పనులను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో రిలీజ్ డేట్, మిగిలిన అప్డేట్స్ వంటి అంశాలపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, నాగచైతన్య నటిస్తున్న దూత(Dhootha) వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. మొదటి సీజన్‌కు ఓటీటీలో మంచి ఆదరణ లభించడంతో సెకండ్ సీజన్‌పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఒకవైపు మిస్టిక్ హారర్ థ్రిల్లర్, మరోవైపు సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్‌తో నాగచైతన్య ఆడియన్స్ కు భిన్నమైన అనుభవాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఆయన కెరీర్లో కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.








