స్మార్ట్‌వాచ్‌లో షాకింగ్ ఫీచర్.. డయాబెటిస్ ముప్పును ముందే పసిగడుతుందా?
మన చేతికి కట్టుకునే స్మార్ట్‌వాచ్ ఇప్పటివరకు మనం ఎన్ని అడుగులు నడిచాం, ఎంతసేపు నిద్రపోయాం, హార్ట్‌రేట్ ఎలా ఉందనే విషయాలనే ఎక్కువగా చెప్పేది. కానీ ఇప్పుడు ఆ గడియారం మన శరీరంలో బయటకు కనిపించని ఓ ముఖ్యమైన మార్పును కూడా ముందుగానే గుర్తించే దిశగా అడుగులు వేస్తోంది. రక్తం తీయకుండానే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో వస్తున్న మార్పులను ట్రాక్ చేసే టెక్నాలజీని గూగుల్ ప్రకటించింది.
కొత్త Health Guardian ఫీచర్లలో భాగంగా ఈ సదుపాయాన్ని Google Pixel Watch, Fitbit డివైజ్‌లకు తీసుకురానుంది. కొత్త Pixel Watch 5 ఆవిష్కరణతో పాటు ఈ ఫీచర్లను ప్రకటించింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. రక్తంలో గ్లూకోజ్‌ను నేరుగా కొలవకుండా, శరీరం నుంచి సేకరించే వివిధ physiological signals ఆధారంగా మెటబాలిక్ ఆరోగ్యంలో వస్తున్న మార్పులను AI గుర్తించే ప్రయత్నం చేస్తుంది.
ఇందుకోసం హార్ట్‌రేట్, Heart Rate Variability, SpO2, కదలికలు, నిద్ర, చర్మ ఉష్ణోగ్రత వంటి డేటాను వారాల తరబడి విశ్లేషిస్తుంది. ఒక్కరోజు వచ్చిన మార్పును బట్టి నిర్ణయం తీసుకోకుండా.. కొంతకాలంగా శరీరంలో ఏర్పడుతున్న నమూనాలను గుర్తించడమే దీని ఉద్దేశం.
ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. ఈ వాచ్ రక్తంలోని షుగర్ లెవెల్‌ను నేరుగా కొలవదు. అంటే ఇది గ్లూకోజ్ మీటర్ లేదా Continuous Glucose Monitorకు ప్రత్యామ్నాయం కాదు. బదులుగా శరీరం ఇన్సులిన్‌ను ఎలా ఉపయోగించుకుంటుందనే దానికి సంబంధించిన సంకేతాలను గుర్తించి, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో మార్పులు వస్తున్నాయా అనే ట్రెండ్‌ను అంచనా వేస్తుంది.
సాధారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగినప్పుడు శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించవు. దీనివల్ల శరీరం మరింత ఇన్సులిన్ తయారు చేయాల్సి రావచ్చు. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే టైప్-2 డయాబెటిస్ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే మార్పును ముందుగానే గుర్తించడం ఉపయోగకరంగా ఉండొచ్చు.
ఈ AI మోడల్‌ను భారీ స్థాయిలో సేకరించిన డేటాతో రూపొందించినట్లు గూగుల్ చెబుతోంది. ఐదు మిలియన్ల మంది అనుమతించిన వినియోగదారుల నుంచి సేకరించిన ఒక ట్రిలియన్ నిమిషాలకు పైగా సెన్సార్ డేటా ఆధారంగా మోడల్‌కు శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. క్లినికల్ బ్లడ్ టెస్టులతో దీని పనితీరును ధృవీకరించామని, పరిశోధన Natureలో ప్రచురించామని కూడా పేర్కొంది.
Health Guardianలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మాత్రమే కాదు. బ్లడ్ ప్రెజర్ ట్రెండ్స్‌ను పాసివ్‌గా అంచనా వేసే ఫీచర్, నిద్రలో శ్వాస నాణ్యతను పరిశీలించే ఫీచర్ కూడా ఉన్నాయి. కొన్ని యూరోపియన్ దేశాల్లో ప్రమాదకరంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినప్పుడు అత్యవసర సేవలకు ఆటోమేటిక్‌గా కాల్ చేసే breathing emergency detection కూడా అందుబాటులోకి వస్తోంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్, బ్లడ్ ప్రెజర్ ట్రెండ్ ఫీచర్లు ఈ ఏడాది శరదృతువులో Pixel Watch 3, 4, 5, Fitbit Airలకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా రావచ్చని గూగుల్ తెలిపింది. Google Health యాప్‌లో నెలవారీ సమ్మరీలు అందుతాయి. ఏదైనా ముఖ్యమైన మార్పు గుర్తిస్తే నోటిఫికేషన్ కూడా రావచ్చు. Google Health Premium సబ్స్క్రైబర్లకు Gemini ఆధారిత హెల్త్ కోచ్ కూడా అందుబాటులో ఉంటుంది.
అయితే దీనిని మెడికల్ డయాగ్నస్టిక్ పరికరంగా చూడకూడదు. ఈ ఫీచర్లకు ఇంకా FDA clearance లేదు. ప్రస్తుతం వీటిని general wellness toolsగానే గూగుల్ అందిస్తోంది. వాచ్‌లో వచ్చిన అలర్ట్‌ను తుది వైద్య నిర్ధారణగా భావించకుండా, అవసరమైతే వైద్య పరీక్షలతో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
అయినా ఈ పరిణామం ఒక పెద్ద మార్పుకు సంకేతం. స్మార్ట్‌వాచ్ ఇక కేవలం అడుగులు, నిద్ర, హార్ట్‌రేట్ లెక్కించే గ్యాడ్జెట్‌గా ఉండకపోవచ్చు. మన శరీరంలో బయటకు కనిపించని మార్పులను కూడా రోజువారీ డేటా ఆధారంగా ముందుగానే గుర్తించే పర్సనల్ హెల్త్ మానిటర్‌గా మారే అవకాశం ఉంది.
అంటే రేపటి స్మార్ట్‌వాచ్.. “మీరు ఈరోజు ఎంత నడిచారు?” అని మాత్రమే అడగదు.
“మీ శరీరంలో ఏదో మార్పు మొదలైంది.. మీరు గమనించారా?” అని కూడా చెప్పొచ్చు.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








