ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే.. జగన్ అసెంబ్లీకి రావాలి : మంత్రి సత్యకుమార్ సవాల్
నేరాలు చేసేవారిని పరామర్శించేందుకే జగన్ (Jagan) యాత్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ( Satya Kumar Yadav) విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ (Assembly)రావాలని సవాల్ విసిరారు. జగన్ అసెంబ్లీకి రారు, వాళ్ల ఎమ్మెల్యేలను కూడా పంపట్లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ విధానంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల (multi-specialty hospitals) నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.








