అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం!
రాజధాని అమరావతికి రాచబాట సిద్ధమైంది. అమరావతి (Amaravati) నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు, బకింగ్‌హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ వంతెన (Steel Bridge)ను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించనున్నారు. విజయవాడ- మంగళగిరి మార్గానికి సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానం చేయడంతో రాజధానికి నేరుగా వెళ్లడానికి మార్గం సుగమమైంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు రెండు దశలు పూర్తికాగా, మÖడో దశ పూర్తయ్యే వరకు ఇబ్బంది లేకుండా ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) మీదుగా విజయవాడ వెళ్లవచ్చు. అదే విధంగా విజయవాడ-మంగళగిరి పాత హైవే మీదుగా 16వ నంబరు జాతీయ రహదారిపైకి చేరుకోవచ్చు.








