ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి చుక్కెదురు
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu)కు మరోసారి చుక్కెదురైంది. డ్రైవర్ సుబ్రహ్మణం (Driver Subrahmanyam) హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో అనంతాబుతో పాటు ఏ2, ఏ3గా ఉన్న కడియాల సతీశ్ (Kadiyala Satish), మహాలక్ష్మి (Mahalakshmi)కి బెయిల్‌ను నిరాకరించింది. నిందుతులకు బెయిల్ ఇస్తే సాక్షుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) ముప్పాళ్ల సుబ్బారావు (Muppalla Subbarao) వాదించారు. పీపీ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే కోర్టు పలుమార్లు అనంతబాబుకు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.








