కొత్త భయం: AIతో కమ్యూనిస్ట్ చైనాకి పెద్ద ముప్పు.. మూలాల్లోనే దెబ్బ?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
చైనాలో ప్రభుత్వం AI విషయంలో ఓ చిత్రమైన పరిస్ధితిని ఫేస్ చేస్తోంది. ఓ ప్రక్క తన శతృ రాజ్యమైన అమెరికాతో పోటీ పడాలి. ప్రపంచ AI రేసులో ముందుండాలి. పరిశ్రమల్లో ఉత్పాదకత పెంచాలి. అలాగే జనాభా తగ్గిపోతున్న సమయంలో కార్మికుల కొరతను భర్తీ చేయాలి. అందుకోసం ప్రభుత్వం Beijing AIకి భారీగా మద్దతు ఇస్తోంది.
అయితే అదే సమయంలో ఏఐ పెరగటం వల్ల తమ పార్టీని నిలబెడుతున్న సామాన్య కార్మికల నుంచి సమస్య ఎదుర్కోబోతోందని రిపోర్ట్ లు చేప్తున్నాయి. ఇది దేశాన్ని ఆలోచనలో పడేస్తున్న అతిపెద్ద డైలమా. అసలేం జరుగుతోంది. దీని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి
చైనా గత కొంతకాలంగా AI కంపెనీలను ప్రోత్సహిస్తోంది. చిప్స్ నుంచి డేటా సెంటర్ల వరకు మౌలిక సదుపాయాలను వేగంగా పెంచుతోంది. ఇప్పుడు humanoid robotsను కూడా నిజమైన పనుల్లోకి దించేందుకు పరుగులు పెడుతోంది. 2026 చివరి నాటికి 10,000కు పైగా commercial humanoid robotsను 100కు పైగా రంగాల్లో ఉపయోగించే లక్ష్యాన్ని చైనా పెట్టుకుంది.
చైనా AI మోడళ్లు కూడా అమెరికా మోడళ్లకు దగ్గరవుతున్నాయి. ఖర్చు తక్కువగా ఉండే open-weight modelsతో చైనా వేగంగా ముందుకు వస్తోంది. AIని ప్రయోగశాలల్లో ఉంచకుండా నేరుగా పరిశ్రమల్లోకి తీసుకెళ్లడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతోంది.
బయటి ప్రపంచానికి ఇది చైనా బలం. కానీ కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రం ఇదే విజయం ఒక రోజు కొత్త సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.
AI విజయం సాధిస్తే ఏం జరుగుతుంది?
ఒకవేళ AI అనుకున్న దానికంటే వేగంగా అభివృద్ధి చెందితే? ఒకవేళ కంపెనీలకు వేల మంది కార్మికుల బదులు వందల AI systems, robotsతోనే పని నడిపించే పరిస్థితి వస్తే? ఒకవేళ లారీకి ఇద్దరు డ్రైవర్లు అవసరం లేకపోతే? ఒకవేళ గిడ్డంగిలో వందమంది చేసే పనిని కొన్ని humanoid robots చేసేస్తే? మొత్తం మీద అన్ని రంగాల్లో కార్మికుల అవసరం భారీగా తగ్గిపోతే?
అప్పుడు సమస్య AI కాదు. ఆ AI వల్ల పని కోల్పోయే మనుషులే. ఇదే చైనాకు మిగతా దేశాల కంటే భిన్నమైన తలనొప్పి. ఎందుకంటే చైనా కేవలం మరో capitalist economy కాదు. అది తన రాజకీయ వ్యవస్థకు కార్మిక వర్గం, సామాజిక స్థిరత్వం, ప్రజల సంక్షేమం వంటి అంశాలను చాలా కాలంగా కేంద్రంగా ఉంచుకున్న కమ్యూనిస్ట్ రాజ్యం.
అందుకే AI వల్ల ఉద్యోగాలు భారీగా తగ్గితే అది కేవలం unemployment statisticsలో కనిపించే సంఖ్య కాదు. అది ప్రభుత్వానికి ఎదురయ్యే రాజకీయ ప్రశ్న కూడా కావచ్చు.
AIని ఆపలేరు.. కానీ AI వల్ల ఖాళీ అయ్యే చేతులను ఏం చేస్తారు? చైనా ఎదుర్కొంటున్న ఈ సమస్యకు మూలం చాలా విచిత్రంగా ఉంది.
దేశంలో working-age population 2050 నాటికి దాదాపు 25 శాతం తగ్గే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో చైనాకు కార్మికులు తక్కువ అవుతారు. అందుకే automation అవసరం. Robots అవసరం. AI అవసరం. ఇక్కడివరకు అంతా లాజికల్గానే ఉంది.
కానీ AI మరో పని చేస్తుంది. అది కార్మికుడి productivityని పెంచడమే కాదు. కొన్ని పరిస్థితుల్లో అతని అవసరాన్నే తగ్గించగలదు. ఇదే అసలు paradox. అంటే చైనా ఒక సమస్యను పరిష్కరించడానికి తీసుకొస్తున్న technology… మరో సమస్యను సృష్టించే అవకాశం ఉంది.
ఈ ప్రభావం ఇప్పటికే కనిపించడం మొదలైందా?
AI వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కోట్ల ఉద్యోగాలు మాయమయ్యాయని చెప్పడానికి ఇప్పటికీ ఆధారాలు లేవు. కానీ చైనాలో కొన్ని రంగాల్లో మార్పు ఇప్పటికే కనిపిస్తోంది. ఉదాహరణకు driverless taxis. Wuhanలో autonomous taxiల పెరుగుదలతో మానవ టాక్సీ డ్రైవర్ల ఆదాయంపై పడిందని రిపోర్టులు చెబుతున్నాయి. 2026లో ఒక సాంకేతిక లోపం కారణంగా కొన్ని autonomous taxis సేవలకు అంతరాయం కలిగినప్పుడు మాత్రం మళ్లీ traditional taxisకు డిమాండ్ పెరిగింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక technology పనిచేసినప్పుడు మనిషి పని తగ్గుతుంది. అదే technology విఫలమైతే మనిషి మళ్లీ అవసరమవుతాడు.
కార్మికుల అసంతృప్తి పెరిగితే?
ఇక్కడే అసలు రాజకీయ కోణం మొదలవుతుంది. ఒక factoryలో automation వచ్చింది. వందమంది ఉద్యోగాలు పోయాయి. వాళ్లలో కొందరికి కొత్త ఉద్యోగాలు దొరికాయి. మరికొందరు gig economyలోకి వెళ్లారు. ఇంకొందరికి పని దొరకలేదు. ఇది ఒక్క factory అయితే పెద్ద సమస్య కాదు. కానీ ఇదే pattern వేలాది factoriesలో జరిగితే? అన్ని రంగాల్లో AI, robotics కలసి labour demandను తగ్గిస్తే?
అప్పుడు అది individual unemployment కాదు.
ఒక సామాజిక వర్గం భవిష్యత్తుపై ప్రశ్న. అక్కడి నుంచి అసంతృప్తి రాజకీయంగా మారే అవకాశం ఉంటుంది. ఇది చైనా ప్రభుత్వానికి ఎందుకు అంత సున్నితమైన అంశమో ఇక్కడే అర్థమవుతుంది.
చైనా రాజకీయ వ్యవస్థలో social stabilityకి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రజల అసంతృప్తి పెద్ద స్థాయికి వెళ్లకుండా నియంత్రించడం ప్రభుత్వానికి కీలకమైన రాజకీయ లక్ష్యం.
అందుకే AI వల్ల ఉద్యోగాల మార్పును Beijing కేవలం economic issueగా చూడలేడు. అది stability issue కూడా.
ఫైనల్ గా…
ఇదే కారణంగా చైనా ప్రభుత్వం ఇప్పుడు AI వల్ల ఉద్యోగాలు ఎలా సృష్టించబడుతున్నాయి, ఎలా నశిస్తున్నాయి అన్నదాన్ని ప్రత్యేకంగా track చేయాల్సిన అవసరాన్ని తన 2026–2030 employment blueprintలో చేర్చింది.
అంటే Beijing కూడా ప్రమాదాన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదని చెప్పలేం. వాళ్లకు సమస్య కనిపిస్తోంది. ఎందుకంటే ఇది సాధారణ unemployment కాదు. అయితే పరిష్కారమే దొరకలేదు.








