మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu), మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (Modugula Venugopala Reddy), గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నూరి ఫాతిమా (Noori Fatima) తదితరులపై గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మెగా డీఎస్సీ (DSC)లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ నెల 10న శంకర్‌విలాస్ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్వన నిర్వహించారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు అతిక్రమించి ప్రజా రవాణా, ట్రాఫిక్ (Traffic)కు అంతరాయం కలిగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారు. ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని పోలీసులు చెబుతున్నా లెక్క చేయకుండా ప్రదర్శన నిర్వహించారని అరండల్‌పేట ఎస్ఐ ఈశ్వరరావు (SI Eswara Rao) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అంబటి, మోదుగుల, ఫాతిమా, రాజనారాయణతో పాటు మొత్తం 17 మంది వైసీపీ నాయకులు, పలువురు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.








