గుడివాడ వన్టౌన్ ఎస్ఐ పై వేటు
కృష్ణా జిల్లా గుడివాడ వన్టౌన్ ఎస్ఐ వై.వి.వి.సత్యనారాయణ (SI Y.V.V. Satyanarayana)ను వీఆర్కి పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం (District SP Office) నుంచి ఆదేశాలు వచ్చాయి. డీఎస్సీ (DSC)లో అక్రమాల పేరుతో ఈ నెల 10న గుడివాడ పట్టణంలో వైసీపీ నిర్వహించిన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ నోటీసును మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి ఎస్ఐ సత్యనారాయణ అందించారు. అయినా కొడాలి నాని పోలీసులు (Police) ఆదేశాలు ధిక్కరించి వైసీసీ శిబిరం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన పరిమాణాల్లో కొడాలి నానితో ఎస్ఐ చనువుగా మెలిగారనే ఆరోపణతో వీఆర్ కి పంపినట్లు సమాచారం.








