మంత్రి లోకేశ్ పేరు ఎత్తే అర్హత .. జగన్కు వైసీపీ నేతలకు లేదు : మంత్రి సవిత
వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan)కు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అంటే భయమని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత (Savitha) అన్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ ( DSC)పై నారా లోకేశ్ చర్చకు పలిచినా జగన్ భయపడి రావడం లేదని చెప్పారు. ఎప్పుడో జరిగిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి జగన్కు సవాల్ చేస్తున్నా. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే ఆధారాలు ఉంటే అసెంబ్లీ (Assembly)కి వస్తే చర్చిద్దాం. మంత్రి లోకేశ్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్, వైసీపీ నేతలకు లేదు. గొడ్డలి పార్టీ చిల్లర రాజకీయాలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా పది ఎంజేసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించాం. రాయలసీమలో 5, ఉత్తరాంధ్రలో 5 ప్రారంభమయ్యాయి. వాటిలో గుంతకల్లులో అధికంగా ఉన్న బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎంజేపీ గురుకుల పాఠశాలను ప్రారంభించాం అని అన్నారు.








