రాజమౌళి ‘వారణాసి’ తర్వాత… ప్రియాంక చోప్రా నెక్స్ట్ మూవీ ఫిక్స్!
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’తో ప్రియాంక చోప్రా గత కొంతకాలంగా బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఆమె నెక్ట్స్ ఏ ప్రాజెక్టు సైన్ చేస్తోంది..ఏ డైరెక్టర్ తో చేస్తోంది. హీరో ఎవరు అనే విషయాలును ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా ఆమె నెక్ట్స్ ప్రాజెక్టు గురించిన వివరాలు బయిటకు వచ్చాయి.ఆ వివరాలు చూద్దాం.
గత కొంత కాలంగా …ప్రియాంక చోప్రా… హాలీవుడ్లో వరుసగా పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ సినిమా చేరింది. ఈసారి ఆమెతో కలిసి నటించబోతున్నది ఆస్కార్ విజేత, ‘Gladiator’ స్టార్ రస్సెల్ క్రో. వీరిద్దరూ కలిసి ‘Bluefly’ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో భారీ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
ప్రియాంకకు కు నెక్ట్స్ లెవెల్..
రీసెంట్ గా వచ్చిన Heads of State, The Bluff సినిమాలతో హాలీవుడ్ చిత్రాలతో తన మార్కెట్ ని సుస్దిరం చేసుకున్న ప్రియాంక… ఇప్పుడు పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో అడుగుపెడుతోంది. ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు. మిస్టరీ, మిలిటరీ ఆపరేషన్స్, సైన్స్ ఫిక్షన్ అంశాలు కలిసిన ఇంటెన్స్ థ్రిల్లర్.
కథ ఏంటి
కాంగో అడవుల్లో కూలిపోయిన ఒక రహస్య విమానాన్ని వెతికే మిషన్‌తో కథ మొదలవుతుంది. ఐక్యరాజ్యసమితి అనువాదకురాలు అయిన ప్రియాంక చోప్రా ఒక ప్రత్యేక సైనిక టీమ్ తో కలిసి ప్రమాదకరమైన ఆపరేషన్‌లో పాల్గొంటుంది. అయితే కొద్దిరోజులకు తెలుస్తుంది. నిజానికి వారు వెతుకుతున్నది సాధారణ విమానం కాదని… ప్రపంచానికి తెలియకూడని రహస్యాన్ని దాచుకున్న ఎయిర్‌క్రాఫ్ట్ అని. ఆ రహస్యం ఏమిటి..ఆ రహస్యం తెలిసిన ప్రియాంక చోప్రా పరిస్ధితి ఏమిటి…అనే విషయాలను టచ్ చేస్తూ …ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్, యాక్షన్ కలిసిన థ్రిల్లర్‌గా మారుతుంది.
ఇది మరో CGI సినిమా కాదు
ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న నిమ్రోడ్ ఆంటల్ ఇప్పటికే Predators వంటి థ్రిల్లర్లతో తన ప్రత్యేక స్టైల్ ని చూపించారు. ఆయన మాటల్లోనే… “ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు. పాత్రల భావోద్వేగాలు, భయం, అనుమానాలతో నడిచే ఇంటెన్స్ థ్రిల్లర్.” అంటే విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథ, టెన్షన్, సస్పెన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతోందని అర్థమవుతోంది.
బిజినెస్ క్రేజ్
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ప్రారంభం కానుంది. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… సినిమా ఇంకా పూర్తికాకముందే Toronto International Film Festival (TIFF) Marketలో ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ హక్కుల అమ్మకాలు ప్రారంభించబోతున్నారు. ఇది నిర్మాతలకు సినిమాపై ఎంత నమ్మకం ఉందో చెప్పే సంకేతంగా పరిశ్రమ భావిస్తోంది.
ఏదైమైనా…
Gladiatorతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రస్సెల్ క్రో ఇప్పటికీ హాలీవుడ్లో అత్యంత గౌరవనీయ నటుల్లో ఒకరు. అలాంటి స్టార్‌తో ప్రియాంక చోప్రా కలిసి నటించడం… ఆమె గ్లోబల్ కెరీర్లో మరో కీలక మైలురాయిగా ఇండస్ట్రీ భావిస్తోంది.
ఒకవైపు భారతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భారీ పాన్-వరల్డ్ సినిమా… మరోవైపు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ త్రిల్లర్ లతో ప్రియాంక కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు చేరబోతోంది.








