పరామర్శల పేరుతో విధ్వంసం, అరాచకం : హోం మంత్రి అనిత
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) బయట అడుగు పెడితే విధ్వంసం, అరాచకాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత (Home Minister Anitha) అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆయన పని అని విమర్శించారు. పరామర్శల పేరుతో బలప్రదర్శన చేస్తూ ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని జగన్ను ప్రశ్నించారు. బాధితులను కాకుండా నిందితులను పరామర్శించడమేంటని నిలదీశారు. గొడ్డలి పార్టీ నేతలు బాధ్యతాయుతమైన విమర్శలు చేయాలి. బెట్టింగ్ (Betting)లో నష్టపోయి మరణించిన వ్యక్తి విగ్రహావిష్కరణకు జగన్ వెళ్లారు. ఆయన కారు (Car) కింద ఓ వ్యక్తి పడితే పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అంబులెన్స్కూ దారి ఇవ్వకుండా గొడ్డలి పార్టీ కార్యకర్తలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జగన్ పరామర్శలో మహిళలపైనా దాడులు చేస్తున్నారు. వైసీపీ నేతలు పోలీసుల (Police)ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పరామర్శల పేరిట జగన్ చేసిన బలప్రదర్శనల కారణంగా ముగ్గురు చనిపోయారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని అయినా జరిగిందా? అని ప్రశ్నించారు.








