7th August 2026

_________

-Bhuvana

వర్షాకాలంలో దోమల పెరుగుదలను ఎలా అరికట్టాలి?

కుండీలు, టైర్లు, బకెట్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండనివ్వకండి. దోమలు నిల్వ నీటిలోనే గుడ్లు పెడతాయి కాబట్టి వారానికి ఒకసారి పూర్తిగా శుభ్రం చేయండి.

నిల్వ నీరు ఉండనివ్వకండి

ఓవర్‌హెడ్ ట్యాంకులు, డ్రమ్‌లు, నీటి పాత్రలకు ఎప్పుడూ బిగుతుగా మూత పెట్టండి. దీంతో దోమలు గుడ్లు పెట్టే అవకాశం తగ్గుతుంది.

నీటి ట్యాంకులను మూసివేయండి

 చెత్త, ఎండిన ఆకులు, పొదలు, డ్రైనేజీ ప్రాంతాలను శుభ్రంగా ఉంచండి. అపరిశుభ్ర ప్రదేశాలు దోమలకు ఆశ్రయంగా మారే ప్రమాదం ఉంటుంది.

ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచండి

కిటికీలు, తలుపులకు మెష్ అమర్చండి. నిద్రపోయేటప్పుడు దోమతెర వాడితే దోమ కాట్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది.

దోమల వలలు ఉపయోగించండి

ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పూర్తి చేతుల దుస్తులు, పొడవైన ప్యాంట్లు ధరించండి. దీంతో దోమ కాట్ల ప్రమాదం తగ్గుతుంది.

పూర్తి దుస్తులు ధరించండి

డెంగ్యూ వ్యాప్తి చేసే ఏడిస్ దోమలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం చురుకుగా ఉంటాయి. ఈ సమయాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోండి.

దోమల చురుకైన సమయాల్లో జాగ్రత్త

జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు లేదా దద్దుర్లు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. స్వయంగా మందులు వాడకండి.

ఇంట్లో జ్వరం ఉంటే నిర్లక్ష్యం వద్దు

నిల్వ నీరు తొలగించడం, పరిశుభ్రత పాటించడం, దోమల నుంచి రక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

చిన్న జాగ్రత్తలే పెద్ద రక్షణ