పలు కీలక నిర్ణయాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ (Cabinet) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 34 అజెండా అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ -2026, ఏపీ పీపీపీ పాలసీ -2026 ముసాయిదాకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దిశ బిల్లు (Disha Bill) -2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024లను ఉపసంహరించి మరింత పటిష్ట చట్టాల రూపకల్పనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మున్సిపల్ భూముల లీజు గడువు పెంపునకు చట్టసవరణల ప్రతిపాదన, యూడీఏల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పాదచారుల భద్రత పాలసీ-2026, రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు, కొత్త జిల్లాలకు 15 కొత్త డీఈవో పోస్టులు, అమరావతి క్యాంటమ్ వ్యాలీ టవర్స్ (Amaravati Quantum Valley Towers)కు రూ.1002.49 కోట్లు కేటాయింపునకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతలను ఎలఅండ్టీకి అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు, డిజైన్ల కోసం అదనపు నిధులు, అమరావతి భూ కేటాయింపులపై జీవోఎం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతి ఐ ప్రాజెక్టుకు రీ టెండర్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.








