భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్..?
భారత క్రికెట్ జట్టుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆతిథ్య శ్రీలంక జట్టుకు ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ వైట్-బాల్ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుసాల్ మెండిస్ కుడి హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా లంక ప్రీమియర్ లీగ్ (LPL 2026) నుండి పూర్తిగా తప్పుకున్నారు. ప్రస్తుతం లంక లీగ్‌లో కొలంబో కాప్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. కాండీ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రన్ తీసే ప్రయత్నంలో ఈ గాయానికి గురయ్యారు.
ఈ హ్యామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెండిస్ తదుపరి చికిత్స మరియు పునరావాస (Rehabilitation) ప్రక్రియ కోసం నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌కు తరలివెళ్లినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 15 నుండి గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్-శ్రీలంక మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కరెక్ట్‌గా సిరీస్‌కు వారం రోజుల ముందే మెండిస్ గాయపడటం, ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో లంక మేనేజ్మెంట్ తీవ్ర ఆందోళనలో పడింది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది టీ20, వన్డేలతో పాటు పీఎస్ఎల్ (PSL) లో కూడా 550 పరుగులతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కుసాల్ మెండిస్ లాంటి అనుభవజ్ఞుడైన కీలక ప్లేయర్ భారత్‌తో టెస్టులకు అందుబాటులో లేకపోతే అది శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.








