అన్ని రోడ్ నెట్వర్క్లను ఒకే సిస్టమ్ లో తీసుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఎంసి ఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో హెచ్ఎం డి ఏ / హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
హాజరైన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి) జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి మణిక్ రాజ్, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు..
అన్నీ రోడ్ నెట్వర్క్ ను ఒకే సిస్టమ్ లో తీసుకు రావాలి..
రోడ్డు లకు సంబందించిన అన్ని విషయాల్ని ఈ సిస్టమ్ లోకి తీసుకోవాలి..
భూసేకరణ,రుణాలు,రోడ్ల నిర్వహణ తో అన్ని అంశాలు ఈ సిస్టం లోకి తీసుకురావాలి..
ఔటర్ రింగ్ రోడ్డు,రీజినల్ రింగ్ రోడ్డు లు,నగరం లోని ఫ్లై ఓవర్లు,అండర్ పాస్ లు,ఇతర రోడ్లు ఈ వ్యవస్థ పరిధి లోకి రావాలి..
ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సరిగా లేదు..
ఔటర్ రింగ్ రోడ్డు పైన ఎక్కడిక్కడ వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి..
ఔటర్ రింగ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం గా ఉన్నాడు..
ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలి..
టీడీఆర్ పైన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి..
ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ చేయాలి..
టీడీఆర్ ప్రక్రియ ను మొత్తం ఆన్లైన్ చెయ్యాలి..
టీడీఆర్ లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవస్థ ను రూపొందించాలి..
రేడియల్ రోడ్డు ల నిర్మాణం వేగవంతం చేయాలి..
కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్ 1 ను డిసెంబర్ 9 లోగా పూర్తి చేయాలి..
రేడియల్ రోడ్ల నిర్మాణం లో అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి..
రోడ్డు నిర్మాణం నాణ్యత లో రాజీ లేదు..
భవిష్యత్ లో ఇబ్బంది రాకుండా రోడ్డు నిర్మాణం లో వాడే మట్టి పైన జాగ్రత లు తీసుకోవాలి..
రోడ్ లకు ఇరువైపులా పచ్చదనం ఉండేలా చూసుకోవాలి..
బద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ అత్యంత కీలకం..
ఎలేవేటెడ్ కారిడార్స్ 1,11 పనులు వేగవంతం చేయాలి..
ఎలేవేటెడ్ కారిడార్ 111 బంజారా హిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ పనులను త్వరగా మొదలు పెట్టాలి..
హైదరాబాద్ నగర భవిష్యత్ రోడ్ల అభివృద్ధి పైనే ఆధారపడి ఉంది..
భూ సేకరణ వేగవంతం చేయాలి..
అధికారులు అలసత్వం చూపించొద్దు..
రోడ్ల ప్లానింగ్,నిర్మాణం లో ట్రాఫిక్ విభాగాన్ని ఇన్వాల్ చేయాలి..
ల్యాండ్ పూలింగ్ లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించవద్దు..








