సింగరేణి చరిత్రలో అద్భుత ఘట్టం
సింగరేణి (Singareni) చరిత్రలో మరో మైలురాయి చేరింది. ఒడిశా (Odisha)లోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే వ్యాగన్ తెలంగాణకు చేరింది. మంచిర్యాల జిల్లా(Mancherial district) జైపుర్ సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి బొగ్గు రైలు చేరుకుంది. సింగరేణి అధికారులు రైలుకు ఘన స్వాగతం పలికారు. 59 వ్యాగన్ల ద్వారా 4 వేల టన్నుల జీ -10 గ్రేడ్ బొగ్గు వచ్చింది. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం, కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కవృతమైందన్నారు.








