బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా? : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ (Prime Minister Modi)ని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధానిని దూషిప్తే తమ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని చెప్పారు. ఒక డీఎస్పీ (DSP)ని బదిలీ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy) అంటున్నారని, అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్న అధికారమని పేర్కొన్నారు. తన పరిధిలో ఉంది కాబట్టే బదిలీ చేశానని చెప్పారు. బీజేపీ నేతలు (BJP leaders) కూడా అసభ్యంగా దూషిస్తున్నారని విమర్శించారు. కాక్రోచ్ జనతా పార్టీని, విద్యార్థులను అంతకంటే ఎక్కువే దూషించారని పేర్కొన్నారు.








