6th August 2026

_________

-Bhuvana

రోజంతా కంప్యూటర్ ముందు పనిచేసేవారికి ఆరోగ్య చిట్కాలు 

ఇంటి నుంచే పని చేయడం సౌకర్యమే కానీ గంటల తరబడి కూర్చోవడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 9 సులభ చిట్కాలు పాటించండి.

వెన్నును నిటారుగా ఉంచి కూర్చోండి. స్క్రీన్ కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవడం వల్ల మెడ, వెన్నునొప్పి ప్రమాదం తగ్గుతుంది.

సరైన కూర్చునే భంగిమ

45–60 నిమిషాలకు ఒకసారి లేచి 3–5 నిమిషాలు నడవండి లేదా స్ట్రెచింగ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

 ప్రతి గంటకు లేచి నడవండి

ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లు చూడండి. దీంతో కళ్ల అలసట తగ్గే అవకాశం ఉంటుంది.

20-20-20 నియమం పాటించండి

పనిలో మునిగిపోతే నీరు తాగడం మరిచిపోతాం. రోజంతా తగినంత నీరు తాగితే శరీరం హైడ్రేట్‌గా ఉండి చురుకుదనం పెరుగుతుంది.

నీరు తాగడం మర్చిపోవద్దు

చిప్స్, బిస్కెట్లకు బదులుగా పండ్లు, నట్స్, మొలకలు లేదా పెరుగు తీసుకోండి. ఇవి ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి.

ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోండి

రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.

చిన్న వ్యాయామానికి సమయం కేటాయించండి

ప్రతిరోజూ 7–9 గంటలు నిద్రపోవడం ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.