తెలంగాణలో మూడు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
తెలంగాణలో పెండింగ్లో ఉన్న మూడు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. కరీంనగర్ (Karimnagar) జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్ (Vikarabad)కు యు.రమేశ్, మేడ్చల్ మల్కాజ్గిరి (edchal-Malkajgiri) (అర్బన్)కు అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramchander Rao) ప్రకటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), ఎంపీ ఈటల రాజేందర్ మధ్య విభేదాలతో ఇన్నాళ్లు ఈ మూడు జిల్లాల అధ్యక్షుల నియామకాలు పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో బండి సంజయ్ నివాసానికి ఈటల సహా ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లారు. వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్లో జిల్లా అధ్యక్షుల నియామకాలను పార్టీ ప్రకటించింది.








