టీటీడీకి భారీ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించిన ట్రస్టులకు రూ.2 కోట్ల విరాళం అందింది. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేటు లిమిటెడ్ ( Trinity Combine Private Limited) సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు సంస్థకు చెందిన ఆర్. సీతారామ్ రెడ్డి (R. Sitaram Reddy), జి.కవిత, త్రినయ్ రెడ్డి, త్రిభువన్ రెడ్డి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి (Venkayya Chowdary)కి విరాళం డీడీలను అందజేశారు.








