వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి ఎదురుదెబ్బ
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం (Subramanyam) హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రాజమహేంద్రవరం ( Rajamahendravaram) ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. నిందితుడికి నేరచరిత్ర ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక పబ్లిక ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు (Muppalla Subbarao) కోర్టులో వాదనలు వినిపించారు. ప్రత్యేక పీపీ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ను డిస్మస్ చేసింది. అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.








