ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల చేతుల మీదుగా “స్టువర్టుపురం స్టూడెంట్స్” ట్రైలర్ విడుదల
బిగ్ బాస్ ఫేమ్ దివి యాక్షన్ అండ్ డాన్స్ హైలెట్ గా తెరకెక్కిన చిత్రం
శివ సాయి ప్రొడక్షన్స్ పతాక పై డి. నిరీక్షణ సమర్పణలో, నిఖిల్, దివి ప్రధాన పాత్రలో డి. రామకృష్ణ దర్శకత్వంలో నిర్మాతలు ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ “స్టువర్టుపురం స్టూడెంట్స్.” 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల లాంచ్ చేశారు. ట్రైలర్ తో పాటు ఆయన సాంగును కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ “స్టువర్టుపురం స్టూడెంట్స్ ట్రైలర్ చూశాను .అలాగే సాంగ్స్ కూడా చూశాను. చాలా బాగున్నాయి.ఈ సాంగ్, ఈ ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయటం సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది . ఎస్పెషల్లీఈ చిత్రంలో దివి చేసిన యాక్టింగ్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. అలాగే డైరెక్టర్ ఆర్కే గారు ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా తెరకెక్కించారని అనిపిస్తుంది .ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అని అన్నారు.
చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ” మా సినిమా ట్రైలర్ విడుదల కోసం అడిగిన వెంటనే కాదనకుండా తన ఆఫీస్ కు పిలిపించుకుని మా ట్రైలర్‌ను సాంగ్ ను ఆవిష్కరించిన దర్శకులు వేణు ఉడుగుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా టెక్నికల్ టీమ్ ఎంతో సహకరించి నన్ను ముందుకు నడిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా 80% పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. సినిమాని అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నామని ఆశిస్తున్నాను. అని అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ స్టువర్టుపురం స్టూడెంట్స్ నాకు ఒక ప్రత్యేకమైన సినిమా, నన్ను డైరెక్టర్ రామకృష్ణ గారు ఒక కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు బాగా కష్టపడ్డారు. డెఫినిట్‌గా ఈ చిత్రం నాకు మంచి కమర్షియల్ హీరోగా గుర్తింపునిస్తుంది .దీనికి కారకుడైన మా డైరెక్టర్ ఆర్కే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్నారు.
హీరోయిన్ దివి మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మా ట్రైలరు సాంగ్ ని రిలీజ్ చేసిన వేణు ఉడుగుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.ఈ సినిమా విషయానికి వస్తే నేను చాలా లక్కీ అని చెప్పాలి, మా డైరెక్టర్ గారు చాలా బాగా కథ రాసుకొని ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా తెరకెక్కించారు. నాకు ఈ సినిమాలో ఓ సాంగ్ ఉంది ఆ సాంగ్‌లో నేను భరతనాట్యం చేస్తాను , బెల్లియు డాన్స్ చేస్తాను ,అలా డిఫరెంట్ వే లో ఉంటుందా సాంగ్. అలాగే నాకంటే ఈ సినిమాకలో నిఖిల్ ఎక్కువ స్కోపు ఉన్న క్యారెక్టర్ చేశారు.డెఫినెట్‌గా ఈ సినిమా మా అందరికీ మంచి నేమ్ తెస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.









