ఢిల్లీకి కప్పం కట్టే పరిస్థితి మళ్లీ వచ్చింది : కేటీఆర్
ఢిల్లీ పార్టీల చేతిలో రాష్ట్రం మళ్లీ తల్లడిల్లుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా కూడా సామంతుల్లా ఢిల్లీ (Delhi)కి కప్పం కట్టే పరిస్థితి మళ్లీ వచ్చిందని విమర్శించారు. నీరు పుష్కలంగా ఉన్నా కాళేశ్వరం, పాలమూరు పంపులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆన్ చేయడం లేదని విమర్శించారు. నిధులు ఢిల్లీకి పంపడం తప్ప సీఎం చేస్తున్నది ఏమీ లేదని ఆరోపించారు.








