సీఎం ఢిల్లీకి వెళ్లకపోతే.. ఎక్కడికి వెళ్లాలి?: ఆది శ్రీనివాస్
రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీకి వెళ్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఢిల్లీకి వెళ్లకపోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. నెహ్రూ కుటుంబాన్ని విమర్శించే అర్హత కేటీఆర్ ( KTR)కు లేదన్నారు. జాతీయ పార్టీగా చేస్తున్నామంటూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మీరు మార్చలేదా? ఢిల్లీ (Delhi)లో పార్టీ కార్యకలపాల కోసం కోట్ల రూపాయలతో ఓ భవనం ఏర్పాటు చేసుకోలేదా? తెలంగాణ పేరుతో ఉన్న బందం తెంచుకున్న వాళ్ల ఇవాళ జాతీయ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని మర్చిపోయారు. ప్రజల ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీపడరు. అధికారం కోల్పోయి రెండున్నరేళ్ల అయినా బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ పోస్టుమార్టం చేసుకోలేదు. కేటీఆర్ ఫ్రస్టేషన్‌తో విమర్శలు చేస్తున్నారు అని అన్నారు.








