కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ను కలిసిన వైసీపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)కు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలైందని వైసీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఢీల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah)ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై వినతిపత్రం అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దేవరపల్లిలో జగన్ పర్యటనకు లక్షల మంది ప్రజలు తరలివచ్చినా పోలీసు బందోబస్తు అరకొరగా కల్పించారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు. భారతీ సిమెంటు (Bharti Cement) సంస్థ పనులను అడ్డుకుంటున్నారని తెలిపారు. అమిత్‌షాకు వినతి పత్రం అందజేసిన వారిలో వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్ రెడ్డి, బాబూరావు, గురుమÖర్తి, తనూజారాణి, మేడా రఘునాథరెడ్డి ఉన్నారు.








