7th August 2026

_________

- Bhuvana

నైట్ షిఫ్ట్‌లో పని చేసే వారు అస్సలు చేయకూడని 8 తప్పులు

నైట్ షిఫ్ట్ ఉద్యోగం శరీర సహజసిద్ధమైన గడియారాన్ని మారుస్తుంది. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.

పగటిపూట నిద్రపోకుండా తిరగడం పెద్ద తప్పు. రాత్రి పని చేశాక కనీసం 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ముఖ్యం.

నిద్రను నిర్లక్ష్యం చేయడం

రాత్రి వేళల్లో వేయించిన పదార్ధాలు, జంక్ ఫుడ్ తినడం వల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి.

జంక్ ఫుడ్ మరియు ఆయిలీ ఫుడ్స్

నిద్ర మత్తు వదలడానికి కాఫీ, టీలు లేదా ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగితే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

కెఫిన్ అతిగా తీసుకోవడం

రాత్రి వేళల్లో హైడ్రేటెడ్ గా ఉండకపోవడం మరో పొరపాటు. తగినన్ని నీళ్లు తాగకపోతే అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

నీరు తక్కువగా తాగడం

పని ఒత్తిడి అని వ్యాయామం పూర్తిగా మానేయకూడదు. రోజూ కాస్త యోగా లేదా నడక శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి.

వ్యాయామం చేయకపోవడం

పగటిపూట నిద్రపోయే ముందు కూడా మొబైల్ లేదా టీవీ చూడటం వల్ల నిద్రలేమి సమస్య మరింత పెరుగుతుంది.

స్క్రీన్ టైమ్ తగ్గించకపోవడం

ఏ సమయంలో పడితే ఆ సమయంలో తినడం ఆరోగ్యానికి హానికరం. రాత్రి వేళల్లో తేలికైన, పీచు పదార్థాలున్న ఆహారం తీసుకోవాలి.

ఆహార వేళలు మార్చడం

మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సరైన ప్లానింగ్ లేకపోతే డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది.

ఒత్తిడిని పెంచుకోవడం

నైట్ షిఫ్ట్ చేసేవారు జీవనశైలిని మార్చుకొని, సరైన ఆహారం, నిద్ర పాటిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.